అందాల తార ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయ్యిన వార్తలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలియానా మరియు తన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తమ తమ ఇన్స్టాగ్రాం లలో కలిసి ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చెయ్యడం తో ఈ రూమర్ నిజమే అని సినీ వర్గాలు అంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్న ఈ జంట కి పెళ్లి కూడా జరిగిందని వినికిడి ఉన్నా, ఇలియానా అఫీషియల్ గా ఎప్పుడూ కంఫర్మ్ చెయ్యలేదు. కాగా ఈ విషయం పై ఇలియానా, నీబోన్ నుండి సరైన నిర్ధారణ ఇంకా రావలసిఉంది.

చాలా క్లోస్ గా ఉన్న ఈ జంట సడన్ గా విడిపోవడానికి కారణం ఏమయ్యుంటుంది? మాకు అందిన సమాచారం మేరకు ఇలియానా ఒక పాపులర్ టాలీవుడ్ హీరోతో క్లోస్ గా ఉండటం వాళ్ల బాయ్ ఫ్రెండ్ కి నచ్చలేక అభ్యంతరం వ్యక్తం చెయ్యడం, దానికి ఇలియానా కి కోపం రావడం వీళ్ల గొడవకి దారి తీసాయని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ వయ్యారి భామ మళ్లీ సింగిల్ అవ్వడంతో “ఆ” టాలీవుడ్ హీరో లైన్ క్లియర్ అయ్యిందా?

కాగా కొన్ని నెలల క్రితం శ్రుతి హాసన్ మైఖేల్ కోర్సేల్ జంట విడిపోయిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here